Share News

వయోవృద్దుల సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:22 PM

వయోవృద్దుల సంక్షేమ చట్టంపై ప్రతీ ఒ క్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ కార్యాలయంలో వయోవృద్దులను ఘనంగా శాలువా లతో సన్మానించారు.

వయోవృద్దుల సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
వయోవృద్దులను సన్మానిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ , రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి) : వయోవృద్దుల సంక్షేమ చట్టంపై ప్రతీ ఒ క్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ కార్యాలయంలో వయోవృద్దులను ఘనంగా శాలువా లతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వయోవృద్ధుల కు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నా య ని వటిని పరిష్కరిస్తున్నామన్నారు. వారి పోషణ, సం క్షేమంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫిర్యాదు దారులకు రక్షణ కల్పిండానికి ఎవరు లేని పక్షంలో ఓ ల్డ్‌ఏజ్‌ హోమ్స్‌, స్వచ్చంద సంస్థల సహకారంతో సం రక్షిస్తామన్నారు. రామగుండం పోలీస్‌ కమీషనర్‌ అం బర్‌ కిశోర్‌ ఝా మాట్లాడుతూ వయోవృద్ధుల సంర క్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నా రు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బు లను ఆర్ధిక క్రమ శిక్షణ పాటిస్తూ ఖర్చు చేయాల న్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టేవారిపై క ఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంస్కృతిక సారధి కళాకారులు జిల్లా కలెక్టర్‌పై ప్రత్యేక పాట పాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో డీసీపీ భాస్కర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, డీఈ వో యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:22 PM