Share News

ఇ-హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:19 PM

ఎల క్ర్టానిక్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఇ-హెచ్‌ఎంఐఎస్‌) పోర్టల్‌లో ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలు నమోదు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి అన్నారు.

ఇ-హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి

కందనూలు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : ఎల క్ర్టానిక్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (ఇ-హెచ్‌ఎంఐఎస్‌) పోర్టల్‌లో ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలు నమోదు చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కేవీ స్వరాజ్యలక్ష్మి అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం ఇ-హెచ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌పై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బందికి జరిగిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. మొదట అవుట్‌ పేషెంట్‌ మాడ్యుల్‌లో రోగి ఆధార్‌కార్డు, అభకార్డు నెంబ రు ఎంట్రీ చేయాలని, ఐడీ కార్డు లేని రోగులకు మాన్యువల్‌గా వివరాలను నమోదు చేయాల న్నారు. వైద్యాధి కారి మాడ్యుల్‌లో రోగుల అ నారోగ్య సమస్యలు, ఏ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఏ మందులు ఎన్ని రోజులు ఇవ్వాలి అనే వివరాలు నమోదు చేసి ల్యాబ్‌ టెక్నీషియన్‌ మాడ్యుల్‌లో రోగికి చేసిన పరీక్షలు ఫలితాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవి కుమార్‌, ఎఫ్‌ఎంఎస్‌ సర్వీస్‌ ఇంజనీర్‌ నరేష్‌, డీడీఎంలు సందీప్‌, నవీన, జిల్లా ఫార్మాసీ సూ పర్‌వైజర్‌ సురేష్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫార్మాసిస్టులు, పర్యవేక్షణ సిబ్బంది, ఆరోగ్య కా ర్యకర్తలు, డేటాఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:19 PM