Share News

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:24 PM

ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి పేర్కొన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలలో పదవ త రగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ యన పాల్గొని మాట్లాడారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న న్యాయాధికారి రవి

జైపూర్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి పేర్కొన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలలో పదవ త రగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ యన పాల్గొని మాట్లాడారు. పుట్టుక నుంచి మరణం వరకు చట్టాలు కలిగి ఉన్నాయన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరు గౌరవం కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. చదువుకునే వయస్సులో చెడు వ్యసనాలకు అలవాటు పడి కేసుల బారిన ప డవద్దని సూచించారు. మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ఆకతాయిలు ఎవరైనా మహిళలను, బాలికల ను వేధిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపీ రాం బాబు, న్యాయవాదులు మహేష్‌, బండారి శ్రీనివాస్‌, రాజేష్‌, వినోద్‌, ఏఎస్‌ ఐ హబీబ్‌, ఎస్‌వో ఫణిబాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:24 PM