క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:27 PM
క్షయ వ్యాధి లక్షణా లు, చికిత్స, నివారణ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కే.రవి కుమార్ తెలిపారు.
- డీఎంహెచ్‌వో కే రవికుమార్
కందనూలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : క్షయ వ్యాధి లక్షణా లు, చికిత్స, నివారణ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కే.రవి కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భా గంగా పెద్దముద్దునూర్ పీహెచ్‌సీ ప రిధిలోని వనపట్లలో క్షయవ్యాధి నిర్ధా రణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధి గ్రస్తులందరినీ పరీక్షించి పూర్తిగా చికిత్స అం దించడం ద్వారా వ్యాధిని అంతం చేయగలమని ఆయన పేర్కొన్నారు. వనపట్ల గ్రామంలో 107 మందికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించినట్లు ఆయ న తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిష్య భారత స్వచ్ఛంద సంస్థ డాక్టర్ పవన్‌కల్యాణ్, సీహెచ్ వో శ్రీను, ఎంపీహెచ్‌ఈవో ఫసియోద్దీన్, టీబీ సూపర్‌వైజర్ శ్రీనివా సులు, ఎక్స్‌రే టెక్నీషియన్ సత్యనారాయణ, ఏఎన్‌ఎమ్‌లు, ఆశా కార్యకర్త లు పాల్గొన్నారు.