ఇంటర్ వార్షిక ఫలితాల్లో ముందంజలో ఉండాలి
ABN , Publish Date - May 14 , 2025 | 11:54 PM
ఇంటర్ వార్షిక ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉండే విధంగా మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఇంటర్మీడియంట్ విధ్యపై సమన్వయ సమావే శం నిర్వహించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, మే 14 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ వార్షిక ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉండే విధంగా మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఇంటర్మీడియంట్ విధ్యపై సమన్వయ సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ విద్యాను మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు సమన్వయంగా కృషి చేయాలని సూచించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి సరైనా మార్గదర్శనం చేయాలన్నారు. జూనియర్ కళాశాలతో పాటు ఐటీఐ ఇతర రంగాల్లో రాణించే విధంగా ప్రొత్సహించాలన్నారు. జూనియర్ కళావాలలతో పాటు ఐటీఐ లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలన్నారు. కళాశాల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపొందించాలన్నారు. జిల్లాలోని కోటపల్లి, జైపూర్, దండేపల్లి, తాండూరు మండలాల్లో నూతన వసతి గృహాలు మంజూరు అయ్యాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల సమయానుకూలంగా బస్సులు నడిపించాలన్నారు. విద్యార్థులు కళాశాల్లో చేర్పించేందుకు సంబందిత అధికారులు, అధ్యాపకుల బృందం సమీష్టిగా కృషి చేయాలన్నారు. జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, (బాలుర-బాలికల), జైపూర్, జన్నారం, దండేపల్లి, లక్ష్సెటిపేట, లల్లో ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో లక్ష 77 రూపాయల వ్యయంతో 95 అగ్ని నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. వసతి గృహాల ఏర్పాటుకు సంబందించిన అధికారులు ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.