Share News

ముషంపల్లి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:37 AM

నల్లగొండ నుంచి ముషంపల్లికి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్‌ చేశారు.

 ముషంపల్లి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి
రోడ్డు పనులు పూర్తి చేయాలని బురదలో నాట్లు వేస్తున్న సీపీఎం నాయకులు

ముషంపల్లి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగార్జున

నల్లగొండ రూరల్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నల్లగొండ నుంచి ముషంపల్లికి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. ఇటీవల కురుస్తు న్న వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదరమయంగా మారడంతో గురువా రం రోడ్డుపై బురదలో సీపీఎం ఆధ్వర్యంలో వరి నాట్లు వేసి నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ - ముషంపల్లి వెళ్లే రోడ్డు పనులు చేపట్టి రెండేళ్లయినా పూర్తి కాలేదని విమర్శించా రు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వం డబ్బు లేదనే సాకుతో రోడ్డు పనులు నిలిపివే యడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశా రు. వర్షాల కారణంగా రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు పడి బురదమయంగా మారాయని అన్నారు. గుంతలను మట్టితో పూడ్చి ప్రజలకు ఇబ్బంది లే కుండా నడవడానికి అనుకూలంగా మరమ్మతులు చేయాలని కోరారు. లే నిచో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, నాయకులు జిల్లా అంజయ్య, కొండ వెంకన్న, బక్కయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:37 AM