పరువుపోతుందని హత్య చేశారు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:40 AM
వివాహే తర సంబంధం కొనసాగిస్తుండడంతో తమ పరువు పొ తుందని భావించి మహిళను హత్య చేసిన నిందితులను సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
వివాహేతర సంబంధం నెరుపుతుందనే హత్య
ఐదుగురి అరెస్ట్, పరారీలో మరొకరు
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసన్నకుమార్
సూర్యాపేటక్రైం, అక్టోబరు 23,(ఆంధ్రజ్యోతి): వివాహే తర సంబంధం కొనసాగిస్తుండడంతో తమ పరువు పొ తుందని భావించి మహిళను హత్య చేసిన నిందితులను సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సూర్యాపేట డీఎస్పీ వి. ప్రసన్న కుమార్ గురువారం రాత్రి సూర్యాపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య-భిక్షవమ్మ దంపతులు గ్రామంలో నివసిస్తున్నా రు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లయ్య లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్లయ్య పెద్ద కుమారుడు భరత్‌కు వివాహమైంది. చిన్న కుమారుడు ప్రవీణ్‌కు వివాహం కాలేదు. భిక్షవమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసా గిస్తుంది. ఈ విషయమై పలుమార్లు కుటుంబ సభ్యులు భిక్షవమ్మను హెచ్చరించారు. గ్రామంలో, కుటుంబంలో పరువు పోతుందని, చిన్న కుమారుడు ప్రవీణ్‌కు వివాహం కావడం లేదని పలుమార్లు చెప్పారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎలాగైనా ఆమెను చంపాలని భర్త మల్లయ్య, హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేసే మల్లయ్య, పెద్ద కుమారుడు కొరివి భరత్, హైదరాబాద్‌లో చికెన్ సెంటర్‌లో పనిచేసే చిన్న కుమారుడు ప్రవీణ్, మల్లయ్య సమీప బంధువు హైదరాబాద్‌లో ఉంటూ చికెన్ సెంటర్ నడుపుతున్న కొరివి మహేష్, మల్లయ్య చిన్న కుమారుడు ప్రవీణ్ మిత్రులైన ఏపూరు గ్రా మానికి చెందిన ఆటో డ్రైవర్లుగా పనిచేసే పూసపల్లి జనార్దన్, పోక బత్తిని వంశీ కలిసి పథకం పన్నారు. ఈ నెల 21 గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ ఉండడంతో భిక్షవమ్మ ఏపూరు గ్రా మానికి వచ్చింది. పంచాయితీ అనంతరం తర్వాత తిరిగి వెళ్తుండగా ముందుగా అనుకున్న పథకం ప్రకారం గ్రామంలోనే జనార్దన్ బైక్‌పై వెళ్లి భిక్షవమ్మను అడ్డుకుని, మహేష్, వంశీలకు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే వారు కారులో సంఘటనా స్థలం వద్దకు వచ్చి కారులో నుంచి దిగి వెంట తెచ్చుకున్న కత్తులతో భిక్షవమ్మను గొంతుకోసి, ఛాతిలో పొడిచి హత్య చేసి పరారయ్యారు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యలో పాల్గొన్న వారిని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. హత్యలో పాల్గొన్న మల్లయ్య, భరత్, ప్రవీణ్, జనార్దన్, వంశీ ఈ నెల 23న సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నట్లు విశ్వసనీయ స మాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, ఆటో, రెండు బైక్‌లు, హత్యకు ఉపయోగించిన కత్తు లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్‌కు తరలి స్తున్నట్లు తెలిపారు. మరో నిందితుడు కొరివి మహేష్ ప్రస్తుతం ప రారీలో ఉన్నాడని, అతనిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ గురుకుల రాజ శేఖర్, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల ఎస్‌ఐలు శ్రీకాంత్, మహేశ్వర్, సిబ్బంది హమీద్, వెంకటేష్, విజయ్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.