kumaram bheem asifabad- పోలీసుస్టేషన్ నుంచి హత్య కేసు నిందితుడి పరార్
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:52 PM
కుమరం భీం జిల్లా తిర్యాణి మండలం పిట్టగూడలో వృద్ధుడిని మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో నాలుగు రోజుల క్రితం హత్య చేసిన నిందితుడు సోమవారం రాత్రి రెబ్బెన సీఐ కార్యాలయం నుంచి పారిపోయాడు. తిర్యాణి మండలంలోని పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంత రావు(50)ను మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్ శనివారం రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసు లు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బహిర్బూమికి వెళుతానని చెప్పడంతో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు బాత్‌రూంకు తీసుకెళ్లారు అక్కడికి చేరుకున్నాక వినోద్ వెంట వచ్చిన పోలీసులను తోసి వేసి భవనం గోడ దూకి బేడీలతోనే పారిపోయాడు.
రెబ్బెన, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా తిర్యాణి మండలం పిట్టగూడలో వృద్ధుడిని మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో నాలుగు రోజుల క్రితం హత్య చేసిన నిందితుడు సోమవారం రాత్రి రెబ్బెన సీఐ కార్యాలయం నుంచి పారిపోయాడు. తిర్యాణి మండలంలోని పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంత రావు(50)ను మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో అదే గ్రామానికి చెందిన సిడాం వినోద్ శనివారం రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసు లు వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బహిర్బూమికి వెళుతానని చెప్పడంతో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు బాత్‌రూంకు తీసుకెళ్లారు అక్కడికి చేరుకున్నాక వినోద్ వెంట వచ్చిన పోలీసులను తోసి వేసి భవనం గోడ దూకి బేడీలతోనే పారిపోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం చుట్టు పక్కల గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావడంతో హంతకుడు పోలీసులకు చిక్కలేదు. మంగళవారం తెల్లవారు జాము నుంచే రెబ్బెన, తిర్యాణి మండలాల్లో నిందితుడి కోసం ముమ్మరంగా గాలించారు. ఈ మేరకు రెబ్బెన పోలీసు స్టేషన్‌కు వెనక వైపు కొంత దూరంలో ఉన్న పత్తి చేనులో నిందితుడికి వేసిన బేడీలు లభించాయి. తిర్యాణి మండలంలోని రొంపల్లి సమీపంలో అక్కడి స్థానికులకు నిందితుడు వినోద్ కనిపించినట్లు స్థానికులు అందించిన సమాచారం మేరకు రొంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు కూడా నిందితుడి ఆచూకీ లభించక పోవడంతో పోలీ సుల్లో ఆందోళన నెలకొంది. రెబ్బెన సీఐ సంజయ్‌తో పాటు తిర్యాణి, రెబ్బెన ఎస్సైలు, సిబ్బంది నిందితుడి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.