ఉద్యమకారులకు మునీర్ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - May 30 , 2025 | 11:36 PM
తెలంగాణ ఉద్యమకారుకు సీనియర్ జర్నలిస్టు మునీర్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌లో మునీర్ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మంచిర్యాలకలెక్టరేట్, మే30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుకు సీనియర్ జర్నలిస్టు మునీర్ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని గౌతమినగర్‌లో మునీర్ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మునీర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మునీర్ కుటుంబ సభ్యులు మాట్లాడిన అంశాలు పరిగణలోకి తీ సుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రకాశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఫఎమ్మెల్సీ కవిత మంచిర్యాల పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులతో పాటు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు ఆమె వెం ట లేకపోవడం చర్చకు దారి తీసింది.
ఫకాళేశ్వర పుష్కరాల సందర్భంగా ఎంపీ వంశీని కార్యక్రమానికి ఆహ్వానిం చక పోవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్త చేశారు. కేవలం కు లాల, మతాల ప్రాతి పదికన రాజకీయాలు చేయవద్దన్నారు. ఆపరేషన్ కగార్ ద్వారా నరమేధానికి పాల్పడుతుందని విమర్శించారు.
నస్పూర్‌లో పరామర్శ...
నస్పూర్ : జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నస్పూర్ పట్టణంలో పర్యటించారు. నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించా రు. జాగృతి జిల్లా నాయకులు కందుల ప్రశాంత్ ఇంటికి వెళ్లి ఆయన్ని పరా మర్శించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి వలన ప్రశాంత్‌పై కేసు నమోదు కాగా ఆయన్ని, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
లక్షెట్టిపేట: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టణ కేంద్రంలో శుక్రవారం కార్య కర్తలను ఆత్మీయంగా పలకరించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఒక వివాహానికి హాజరై వెళ్తుండగా జాగృతి నాయకురాలు తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ అసోసియే షన్ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన బానాల నిష లెనిన్ నివాసంలో కాసేపు కార్యకర్తలతో పాటు మహిళల తో ముచ్చటించారు.
శ్రీరాంపూర్: ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాలకు వెళ్తూ శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఆగారు. కారు దిగి తన అభిమానులకు అభివాదం చేసి, తిరిగి కారెక్కారు. ఆమె అభిమానులు పూలు చల్లుతూ, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అక్కడికి తె లంగాణ జాగృతి నాయకులుగానీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) నాయకులుగానీ రాలేదు. ఆమెకు స్వాగతం పలుకలేదు.