కార్మికుల గొంతుక మునీర్
ABN , Publish Date - Jun 08 , 2025 | 11:32 PM
కార్మికుల, కర్షకుల గొంతుక సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీ ర్ అని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయుడబ్ల్యుజే(హెచ్143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, మంచి ర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.
టీయుడబ్ల్యుజే(హెచ్143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ
మంచిర్యాలకలెక్టరేట్, జూన్8 (ఆంధ్రజ్యోతి): కార్మికుల, కర్షకుల గొంతుక సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీ ర్ అని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, టీయుడబ్ల్యుజే(హెచ్143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, మంచి ర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఫంక్షన్ హాల్‌లో మునీర్ అన్నా యాదిలో... అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మునీర్ చిత్రపటానికి అల్లం నారాయణ, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, విలేకరులు, కుటుంబ సభ్యులు పూల మాలలు వేసి నివాళు లు ఆర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునీర్‌తో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పి సకల జనుల సమ్మెలో సింగరేణి జేఏసీ కన్వీనర్‌గా మునీర్ అందరిని సమన్వయం చేయడంలో సఫలీకృతుడయ్యారన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలను స్వయంగా గనుల వద్దకు వెళ్లి ప్రత్యేక్షంగా కలిసి వారితో చర్చించేవాడని సింగరేణిపై వార్తలకు ఉత్తమ జర్నలిస్టు అవార్డును సొంతం చేసుకున్నాడన్నారు. రానున్న రోజుల్లో ము నీర్ పేరు మీద సింగరేణి ప్రాంత పెన్నీస్‌లకు ఏటా అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం మునీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంక టేశ్వర్‌గౌ డ్, సీనియర్ నాయకులు ముకేశ్‌గౌడ్, దుర్గం అశోక్, శ్రీదేవి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజి రెడ్డి, సీనియర్ నాయకుడు రామ్మూర్తి, టీయుడబ్ల్యుజ(హెచ్143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారు తిసాగర్, జోగానంద, జిల్లా కన్వీనర్ ఉమేశ్, కో కన్వీనర్లు చెట్ల రమేశ్, రేణికుంట్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, స్థానిక అడ్వకేట్ సంధాని, అబ్బాస్, విజయ్ పాల్గొన్నారు.