మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:25 PM
మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆద్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు.
నస్పూర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆద్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికుల డాటాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. మూడు దశాబ్దాలుగా మున్సిపాలిటీలో పారిశుద్ద్య, ఇంజనీరింగ్, వాటర్ సరఫరా, ఎలక్రిషన్స్, వివిధ విభాగాల్లో కార్మికులు పని చేస్తున్నరన్నారు. 60 సంవత్సరాలకు పైబడిన వారి స్థానంలో వారి యొక్క కుటుంబ సభ్యుల కు ఒక్కరి అవకాశం కల్పించాలన్నారు. వారి కుటుంబ సభ్యుల పిల్లల పేర్లను సీడిఎంఏ కార్యాలయంకు పంపాలని కోరారు. 60 సంవత్సరాల పైబడిన వారికి పీఎఫ్, ఈస్‌ఐ వర్తించకపోవడం వలన ప్రభుత్వ పరంగా వచ్చే మెడికల్ పీఎఫ్ పెన్షన్ రాకపోవడంతో నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. కార్మికులకు తగిన న్యాయం జరిగే విదంగా వారసత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ అధ్యక్షుడు కోయ్యల వెంకటి, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ ఎండి సోయల్ ఖాన్, నాయకులు రాజేందర్, సుధాకర్, సాగర్, తిరుపతి, సత్యనారాయణ, రజిత, అశోక్, దుర్గమ్మ, పద్మ, రమా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.