Share News

kumaram bheem asifabad- మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:19 PM

మల్టీ పర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి జూనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు.

kumaram bheem asifabad- మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలి
కెరమెరిలో ఎంపీడీవోకు వినతిపత్రం ఇస్తున్న కారోబార్లు

కెరమెరి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మల్టీ పర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి జూనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ పర్పస్‌ విధానం ద్వారా కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే జీవో .51ని రద్దు చయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌, సిబ్బంది సంతోష్‌, రాజేష్‌, హీరాజీ, పాండు, బాలు, అనీల్‌, శ్రీకాంత్‌, జైవంత్‌ తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మల్టీపర్పస్‌ వర్కర్లు చేపడుతున్న నిరసన మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నది. రెండో రోజూ ఆసుపత్రి ఆవరణంలో ఽధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపెందర్‌ మాట్లాడుతూ ఐదు నెలలుగా పెండింగెలో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు. మల్టీపర్పస్‌ వర్కర్లు ఎలాంటి ఆర్డర్‌ కాపీలు లేకుండా పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాలా, నాయకులు అడె లక్యానాయక్‌, మాజీ సర్పంచులు మడావి భీంరావ్‌, మేస్రాం రాహుల్‌, మాజీ డైరెక్టర్‌ గేడాం లక్ష్మణ్‌ తదితరులు పాల్గోన్నారు.కార్యక్రమంలో వర్ర్లు దేవరావ్‌, మారుతి, శంకర్‌,సందీప్‌, రాహుల్‌, కళావతి, రంభ,ల లిత, సుజాత, రజనీకాంత్‌, పరమేశ్వర్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చింతలమానేపల్లి మండలంలో పని చేస్తున్న పంచాయతీ వర్కర్లు మంగళవారం ఎంపీడీవో సుధాకర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని, విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద భీమా అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు విలాస్‌, సంజీవ్‌, డి.విలాస్‌, గణేష్‌, తిరుపతి, రవి తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, మల్టీ పర్పస్‌ విధనాన్ని రద్దు చేయాలని జీవో .51ని సవరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు వసంత్‌, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కౌటాల మండలంలో పని చేస్తున్న పంచాయతీ వర్కర్లు మంగళవారం ఎంపీడీఓ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్టీ పర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని, విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 10:19 PM