Share News

కొల్లాపూర్‌లో మల్టీపర్పస్‌ ఆడిటోరియం

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:19 PM

యోజకవర్గ కేంద్రమైన కొల్లాపూర్‌లో మల్టీప ర్పస్‌ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 3 కోట్ల ని ధులు కేటాయించినట్లు ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

కొల్లాపూర్‌లో మల్టీపర్పస్‌ ఆడిటోరియం

- రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ కేంద్రమైన కొల్లాపూర్‌లో మల్టీప ర్పస్‌ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 3 కోట్ల ని ధులు కేటాయించినట్లు ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిధుల నుంచి నిఽధులు మం జూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ విడుదల చేసినట్లు జీవో ఆర్‌టీ నెంబర్‌ 243 ఉత్తర్వులు రాష్ట్ర పర్యాటక సాం స్కృతిక ఎక్సైజ్‌ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రానికి మల్టీ పర్ప స్‌ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం మూ డు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చే సిందని దీంతో కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజ లకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనుకూలమైన ప్రదేశంలో మల్టీపర్పస్‌ ఆడిటోరి యం నిర్మించి నియోజకవర్గ ప్రజలు వివిధ ర కాల ఈవెంట్లు నిర్వహించుకునేందుకు అధు నాతన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మల్టీపర్ప స్‌ ఆడిటోరియంలో వ్యాపార సమావేశాలు సె మినార్లతో ఆటో ప్రైవేటు వ్యక్తులు సమావేశా లకు వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు. సాం స్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, నృత్య ప్రదర్శ నలు, సంగీత కచేరీల కోసం మల్టీపర్పస్‌ ఆడి టోరియం ఉపయోగపడుతుందన్నారు. నిరుద్యో గ యువతీ యువకులకు వివిధ అంశాలపై శిక్ష ణ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు వివా హాది కార్యక్రమాలకు సామాజిక కార్యక్రమాల కు మల్టీపర్పస్‌ ఆడిటోరియం ఉపయోగపడు తుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పను లు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Aug 19 , 2025 | 11:20 PM