kumaram bheem asifabad- భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:49 PM
మొహర్రం వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గొడవెల్లి, కంచుకోట, పోట్టి శ్రీరాములుచౌక్, బజర్‌వాడీ, హడ్కో కానీ, జన్కాపూర్‌లలో మొహర్రం వేడుకలు నిర్వహించారు. మలిద ముద్దలతో, బెల్లం షర్బత్‌తో ప్రత్యేక వంటకాలతో డప్పుచప్పుల మధ్య పీరీలను ఊరేగిం చారు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): మొహర్రం వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గొడవెల్లి, కంచుకోట, పోట్టి శ్రీరాములుచౌక్, బజర్‌వాడీ, హడ్కో కానీ, జన్కాపూర్‌లలో మొహర్రం వేడుకలు నిర్వహించారు. మలిద ముద్దలతో, బెల్లం షర్బత్‌తో ప్రత్యేక వంటకాలతో డప్పుచప్పుల మధ్య పీరీలను ఊరేగిం చారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు, భక్తులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మొహర్రం వేడుకలను మండలంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఖమన, వాంకిడి, బంబార, ఇంధాని తదితర గ్రామాల్లో పీరీల బంగ్లాల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మొహర్రం పండుగ సందర్బంగా తొమ్మిది రోజుల పాటు ఉన్న ఉపవాసాలను విరమించారు. భాజా భజంత్రీలతో పీర్లను గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ సమీప చికిలి వాగులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుం డా సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పీరీల బంగ్లా నుంచి పీరీలను భాజాభజంత్రీలతో డౌనల్ ఏరియా, బెస్తవాడ, ఎస్సీ కాలనీ, రైల్వే స్టేషన్, తదితర కాలనీల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సమీప వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పీరీల బంగ్లా అధ్యక్షుడు హనుమంతు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన గ్రామాల్లో ఆదివారం మొహర్రం వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు, ముస్లింలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. పీరీలను వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఎదురుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని పవర్‌గూడ పీరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవర్‌గూడతో పాటు జామ్ని, జైనూర్, లేండిగూడ, కొలాంగూడ తదితర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అన్నదానం నిర్వహించారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో మొహర్రం వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి లింగాపూర్ మండలం వంకమద్ది గ్రామానికి చెందిన పీర్లు అతిథిగా తీసుకొచ్చారు. మొహర్రం పండుగ త్యాగానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దినంగా భావిస్తారు. మండల కేంద్రంతోపాటు భూర్నూర్(కే), భూర్నూర్(బి), పామువాడ,దేవుడుపల్లి, పంగడి తదితర గ్రామాల్లో పీర్ల పండగ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.