ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్‌గా ఎం.ఎస్.ఆర్ వరప్రసాద్
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:55 AM
ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్- హైదరాబాద్ చైర్మన్‌గా ఎం. శివరామవరప్రసాద్, వైస్‌చైర్మన్‌గా పి.ఆర్.వి.పి.ఎస్ రాజు ఎన్నికయ్యారు.
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్- హైదరాబాద్ చైర్మన్‌గా ఎం. శివరామవరప్రసాద్, వైస్‌చైర్మన్‌గా పి.ఆర్.వి.పి.ఎస్ రాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు కో-ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరితో పాటు సొసైటీలో జి.పి.రావు, ఏ.కోటేశ్వరరావు, జె.సత్యనారాయణ, ఏ.సోమలింగంగౌడ్, ఎం.శ్రీనివాసులు, బి.ప్రభాకర్‌రావు, ఎం.బాబురాజేంద్రప్రసాద్, కె.లావణ్యరేఖ, ఎల్.శరణ్యకృష్ణలు బోర్డులో డైరక్టర్లుగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించి ఈ ఎన్నికలను నిర్వహించారు. ఈ పాలకవర్గం 2030 వరకు కొనసాగనుంది.