కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:57 PM
సుప్రీం కోర్టు న్యాయమూర్తి బీ ఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ మందక్రిష్ణ మాదిగ ఇచ్చిన పి లువులో భాగంగా సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీ ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం అ దనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు.
నస్పూర్, అక్టోంబరు 13 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టు న్యాయమూర్తి బీ ఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ మందక్రిష్ణ మాదిగ ఇచ్చిన పి లువులో భాగంగా సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీ ఎస్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం అ దనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతి పత్రం అందించారు. ప్రధాన రహదా రి వద్ద నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు నల్ల కండువాల ధరించి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ సీజే పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు న మోదు చేసి అరెస్టు చేయాలన్నారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడే వి ధంగా దర్యాప్తు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కా కుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు శ్రీనివాస్, బానయ్య, మల్లేష్ పాల్గొన్నారు.