kumaram bheem asifabad- వందేభారత్ హాల్టింగ్‌ను ప్రారంభించిన ఎంపీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:11 PM
వందేభారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌ను గురువారం కాగజ్‌నగర్‌లో ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేరుగాంచిన వందేభారత్ రైలు కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించామని అన్నారు. కాగజ్‌నగర్ వాసులకు ఎంత ఉపయోగంగా ఉండే ఈ రైలు హల్టింగ్ నిరీక్షణకు తెరపడినట్టు తెలిపారు.
కాగజ్‌నగర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వందేభారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌ను గురువారం కాగజ్‌నగర్‌లో ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేరుగాంచిన వందేభారత్ రైలు కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ ఇచ్చేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించామని అన్నారు. కాగజ్‌నగర్ వాసులకు ఎంత ఉపయోగంగా ఉండే ఈ రైలు హల్టింగ్ నిరీక్షణకు తెరపడినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంస్కరణల ఫలితంగానే నూతన రైళ్లు వచ్చినట్టు చెప్పారు. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే ఈ రైలు ఇటీవల మంచిర్యాల రైల్వే స్టేషన్‌కు హాల్టింగ్ ఇచ్చారని, ఇప్పుడు కాగజ్‌నగర్‌కు కూడా వచ్చిందని తెలిపారు. కాగజ్‌నగర్‌కు మరిన్ని రైళ్లను హాల్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నాయకత్వంలో రైల్వేలు అపూర్వరమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ.60 కోట్ల నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. కాగజ్‌నగర్ నుంచి కొల్‌కత్తా వెళ్లేందుకు, కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు మరో రైలు స్పెషల్ రైలు వేయాలని కోరారు. సిర్పూరు(టి) రైల్వేస్టేషన్‌ను ప్యాసింజర్, ఇతర రైళ్లను హాల్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం ఎం.గోపాల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
కాగజ్‌నగర్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. కాగజ్‌నగర్‌లో పాల్వాయి పురుషోత్తంరావు కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమలో గురువారం ఆయన మాట్లాడారు. క్రీడాకారుల్లో క్రీడా స్పూర్తిని వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. క్రీడాకారులు ప్రతిభ జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. అలాగే క్రీడా అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యచరణ చేపడుతున్నట్టు తెలిపారు. ఖేలో ఇండియా స్కీం ద్వారా క్రీడలను అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు స్మారక కబడ్టీ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ క్రీడల్లో ఓటమి చెందిన వారు నిరాశ పడకుండా గెలుపుకు కృషి చేయాలన్నారు. కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.