Share News

Chamala Kiran Kumar Reddy: శేరిలింగంపల్లిలోనూ అవకతవకలు : చామల

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:37 AM

రాజ్యాంగ బద్ధంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

Chamala Kiran Kumar Reddy: శేరిలింగంపల్లిలోనూ అవకతవకలు : చామల

రాజ్యాంగ బద్ధంగా, పారదర్శకంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయే అవకాశం ఉందని భావించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.


మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, అసోంలో ఓటమి ఖాయమనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఓటరు జాబితాల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Updated Date - Aug 13 , 2025 | 05:37 AM