MP Etela Rajender: హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లను వేగంగా నిర్మించండి
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:33 AM
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ల పనులను వేగంగా చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్..
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ ఈటల వినతి
హైదరాబాద్/మేడ్చల్ టౌన్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ల పనులను వేగంగా చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్-నాగ్‌పూర్ 44వ నంబరు జాతీయ రహదారిపై జరుగుతున్న వంతెన, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పలు ఫ్లైఓవర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఎంపీ ఈటల, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మె ల్యే రామారావు పటేల్ తదితరులు ఆదివారం నాగ్‌పూర్‌లో గడ్కరీని కలి సి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈటల.. పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్ల నిర్మాణాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉప్పల్, కొంప ల్లి ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ల పనులను సత్వరం పూర్తిచేయాలని కేంద్రమంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన గడ్కరీ.. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ‘‘బాలానగర్-నర్సాపూర్ హైవేలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగినందున.. ఆ రహదారిపైనా ఫ్లైఓవర్ మంజూరు చేయాలని కోరాం. సాగర్ ఎక్స్ రోడ్డు వైపు ఫ్లైఓవర్ నిర్మించాలని కోరగా.. గడ్కరీ అంగీకరించారు’’ అని ఈటల తెలిపారు.