Family Tragedy: సిరిసిల్లలో తల్లీ కొడుకుల ఆత్మహత్య
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:34 AM
మానసిక స్థితి సరిగా లేక తల్లి.. తన తల్లి ఇక లేదన్న మనస్థాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది....
మానసిక స్థితి సరిగ్గా లేక తల్లి.. మనస్తాపంతో కుమారుడు..
తంగళ్లపల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మానసిక స్థితి సరిగా లేక తల్లి.. తన తల్లి ఇక లేదన్న మనస్థాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తంగళ్లపల్లి మండల కేంద్ర వాసి మంచికట్ల లలిత(56)కి పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొడుకు అభిలాష్(34) ఉన్నాడు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో అభిలాష్ ఆందోళన చెందుతున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి తల్లి కనిపించలేదు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సిరిసిల్లలోని ఎల్లమ్మ దేవాలయ సమీపంలో మానేరు నదిలో బయట పడ్డ మహిళ మృతదేహం తల్లిదేనని గుర్తించాడు. మనస్థాపానికి గురైన అభిలాష్.. బంధు మిత్రులు చూస్తుండగానే తానూ నదిలో దూకేశాడు. దీంతో అతడి మిత్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం 2 గంటలు గాలించిన తర్వాత అభిలాష్ మృతదేహం బయట పడింది. అవివాహితుడైన అభిలా్‌షకు వివాహితులైన ఇద్దరు చెల్లెళ్లున్నారు. తండ్రి దేవరాజు ఐదేళ్ల క్రితమే ప్రమాదవశాత్తు మరణించాడు.