MotherRights: తల్లికి బుక్కెడు బువ్వ పెట్టని కుమారుడు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:14 AM
పెద్ద కుమారుడు తన వాటా ఆస్తిని తీసుకొని బుక్క బువ్వ కూడా పెట్టడం లేదంటూ జోగుళాంబ గద్వాల జిల్లా వీవర్స్‌కాలనీకి చెందిన శంకరమ్మ ప్రజావాణిలో...
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన తల్లి
గద్వాల క్రైం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పెద్ద కుమారుడు తన వాటా ఆస్తిని తీసుకొని బుక్క బువ్వ కూడా పెట్టడం లేదంటూ జోగుళాంబ గద్వాల జిల్లా వీవర్స్‌కాలనీకి చెందిన శంకరమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శంకరమ్మ భర్త 18 సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఆస్తిని పెద్దమనుషుల సమక్షంలో పెద్ద కుమారుడు రాములు, చిన్న కుమారుడు వెంకటేష్, కుమార్తెకు పంచారు. ప్రతీనెల తల్లికి ఇద్దరు కుమారులు రూ.10వేల చొప్పున, కుమార్తె రూ.2వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. నాటి నుంచి శంకరమ్మ చిన్నకుమారుడు వెంకటేష్ దగ్గరే ఉంటున్నారు. పెద్ద కుమారుడు రాములు, కోడలు రాజేశ్వరి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే అయినా, కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వడం లేదని శంకరమ్మ ఆరోపించారు. తాను ఇచ్చిన ఆస్తిని తిరిగి తనకు వచ్చేలా చూడాలని, తనను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్‌ను ఆమె కోరారు.