Share News

Family tragedy: తల్లీ కొడుకుల అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:21 AM

సంగారెడ్డి జిల్లా తెల్లాపుర్‌ జేపీ కాలనీలోని ఓ ఇంట్లో తల్లీ కొడుకులు గురువారం అను మానాస్పద స్థితిలో మృతి చెందారు.

Family tragedy: తల్లీ కొడుకుల అనుమానాస్పద మృతి

  • అదే ఇంట్లో ప్రాణాపాయస్థితిలో మరో వ్యక్తి

  • వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

రామచంద్రాపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా తెల్లాపుర్‌ జేపీ కాలనీలోని ఓ ఇంట్లో తల్లీ కొడుకులు గురువారం అను మానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరో వ్యక్తి ప్రస్తు తం ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన చంద్రకళ (34), ఆమె కుమారుడు రేవంత్‌ (13), శివరాజ్‌ అనే మరోవ్యక్తి అయిదు రోజుల క్రితం తెల్లాపుర్‌లోని జేపీ కాలనీకి వచ్చి తాము ఓ కుటుంబమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఆ ఇంట్లో నుంచి హాహాకారాలు, ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా వారు ముగ్గురూ తీవ్ర రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల్లీకొడుకులను గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు ఉంది. శివరాజ్‌ కుడా గొంతు కోసిన స్థితిలో ప్రాణాలతో పోరాడుతూ కనిపించాడు. పోలీసులు ప్రాణాలతో ఉన్న శివరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - Dec 26 , 2025 | 05:21 AM