Child Strangling: 3 ఏళ్ల కూతుర్ని గొంతుపిసికి చంపిన తల్లి
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:21 AM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతురిని ప్రియుడితో కలిసి గొంతుపిసికి చంపిందో తల్లి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం...
వాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి ఘాతుకం
శివ్వంపేట, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతురిని ప్రియుడితో కలిసి గొంతుపిసికి చంపిందో తల్లి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శభా్‌షపల్లికి చెందిన బంటు మమతకు రాయపోల్ మండలానికి చెందిన వడ్డేపల్లి భాస్కర్‌తో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి చరణ్(4), తనుశ్రీ (3) పిల్లలు. భర్త భాస్కర్‌కు అర్థమయ్యేలా మాట్లాలేకపోవడం అనే బలహీనత ఉండటంతో దాన్ని సాకుగా చూపి.. అతడితో కలిసి ఉండలేనని, పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ చెప్పి పిల్లలను తీసుకొని మమత అత్తింటి నుంచి శభా్‌షపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు అదే గ్రామానికి చెందిన ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న మమత ఈ ఏడాది జూన్ 7న కుమారుడిని తల్లి వద్దే వదిలేసి. తనుశ్రీని వెంటబెట్టుకొని ప్రియుడు ఫయాజ్‌తో కలిసి పుట్టింటి నుంచి బయటకొచ్చింది. అయితే గ్రామ శివారులో మమత, ఫయాజ్ కలిసి చిన్నారి తనుశ్రీని గొంతు పిసికి చంపి.. గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. గతంలోనూ ఇద్దరు కొన్ని రోజులు కనిపించకుండా పోవడంతో బంధువులు అప్పట్లోనే వెతికిపట్టుకుని వచ్చారు. ఈసారి వారి ఆచూకీ దొరక్కపోవడంతో భర్త భాస్కర్ మే 27న శివ్వంపేట పోలీ్‌సస్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. విచారణ చేపట్టిన పోలీసులు మమత, ఫయాజ్ ఏపీలోని గుంటూరులో ఉన్నారని తెలుసుకొని, అక్కడికి వెళ్లి అదుపులో తీసుకుని విచారించారు. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. కుమార్తెను చంపి, పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని నిందితులు చూపించగా, శుక్రవారం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది.