kumaram bheem asifabad- దోమల రొద.. కరువైన నిద్ర
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:29 PM
వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా దోమలతో ఈ ప్రమాదం ఎక్కువ. దోమలను నివారించడానికి గ్రామ పంచాయతీలకు అందజేసిన ఫాగింగ్ యంత్రాలు సిబ్బంది పట్టించుకోక పోవడంతో నిరుపయోగంగా మారాయి. వానలకు గతంలో నీరు నిలువ ఉండడం, మురుగు కాలువల్లో అపరిశుభ్రత కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి
జైనూర్/లింగాపూర్/సిర్పూర్(యు), జూలై 11 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా దోమలతో ఈ ప్రమాదం ఎక్కువ. దోమలను నివారించడానికి గ్రామ పంచాయతీలకు అందజేసిన ఫాగింగ్ యంత్రాలు సిబ్బంది పట్టించుకోక పోవడంతో నిరుపయోగంగా మారాయి. వానలకు గతంలో నీరు నిలువ ఉండడం, మురుగు కాలువల్లో అపరిశుభ్రత కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. తరుచు విద్యుత్ సరఫరాలో అంతరా యం కారణంగా రాత్రి పూట దోమల రోదతో నిద్ర పట్ట డం లేదని ప్రజలు వాపోతున్నారు. నాలుగేళ్ల కిందట పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ఫాగింగ్ యం త్రాలు మూలకు చేరడంతో దోమల నివారణ సాధ్యం కావడం లేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటి వరకు గ్రామాల్లో ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. పలు గ్రామ పంచాయతీలకు అందజేసిన ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయని, పని చేయడం లేదని గ్రామ కార్యదర్శులు చెబుతున్నా రు. పలుమారు మార్లు మరమ్మతులు చేసినప్పటికీ సరిగా పని చేయక పోవడంతో వాటిని పక్కన పెట్టెశా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దోమల నివారణకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- డ్రైనేజీలు అంతంత మాత్రమే..
జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చాలా చోట్ల సీసీ రోడ్లు ఉన్నా డ్రైనేజీల సదుపాయం అంతంత మాత్రం గానే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. స్థానికులే ఇళ్ల ముందు గుంత తవ్వుకు ని వృధా నీటిని కాలువల్లోకి చేరేలా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. కాలువల్లో రోజుల తరబడి నిలిచిన నీరు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. అధికారులు గ్రామాల్లో పర్యటించే క్రమంలో రోడ్ల పక్కన సున్నం పోసి పనై పోయిందనేలా వ్యవహరిస్తున్నారు. కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు మరమ్మతులకు గురైన ఫాగింగ్ యంత్రాలను వినియోగంలోకి తీసుకోరాడంతో పాటు నిర్వాహణకు రసాయనాలు, డీజిల్, పెట్రోల్ కోసం అవసరమైన నిధులు వెంటనే గ్రామ పంచాయ తీలకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.