విజృంభిస్తున్న దోమలు...
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:40 PM
జిల్లాలో ము న్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వ ర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరు గుతోంది. గుంపులు గుంపులుగా పుట్టుకొస్తున్న దోమ లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్రమైతే చా లు.. చెరువులు, నాలాల పక్కనున్న కాలనీల్లో ప్రజలు తలుపులు తెరవాలంటేనే భయపడిపోతున్నారు.
-వర్షాల కారణంగా వేగంగా వృద్ధి
-సాయంత్రం వేళల్లో కుప్పలుగా ఇళ్లల్లోకి
-నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం
-డెంగ్యూ, గున్యా వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం
-మున్సిపాలిటీల తీరుపై ప్రజల అసహనం
మంచిర్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ము న్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వ ర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరు గుతోంది. గుంపులు గుంపులుగా పుట్టుకొస్తున్న దోమ లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్రమైతే చా లు.. చెరువులు, నాలాల పక్కనున్న కాలనీల్లో ప్రజలు తలుపులు తెరవాలంటేనే భయపడిపోతున్నారు. వీధు ల్లో డ్రైనేజీలను రోజుల తరబడి శుభ్రపరచకపోవడం, మురికి నీటిపై దోమలు వేగంగా వృద్ధి చెందుతుండ టంతో ప్రజలు రోగాల బారినపడే అవకాశాలు ఉన్నా యి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని ధృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దోమల నియంత్రణ చర్యలను మొక్కుబడిగా చేపడుతూ ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చే స్తున్నారు. ఈ పరిస్థితి గ్రామ పంచాయతీలతో పోల్చితే మున్సిపాలిటీలలో మరింత అధ్వానంగా తయారైంది.
జాడలేని ఫాగింగ్...
వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు కా వస్తున్నా ఇప్పటి వరకు వీధుల్లో ఫాగింగ్ చేపట్టకపోవ డమే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకా లం ప్రారంభమైందంటే గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తేడా లేకుండా విరివిరిగా దోమల ని వారణ చర్యలు చేపట్టేవారు. మున్సిపాలిటీల్లో మంచి శుక్రవారం, మంచి ఆదివారం పేరుతో అధికారులు, పా లకులు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇందులో భా గంగా పారిశుధ్య కార్మికులతో కలిసి కూడళ్లు, టైర్ల కొ ట్లు, డ్రైనేజీల్లో నీరు నిలువ ఉండకుండా చర్యలు చేప ట్టేవారు. కొబ్బరి బోండాల్లోనూ నీరు నిలువ ఉండ కుం డా వాటిని జనావాసాల నుంచి దూరంగా తరలించే వారు. ఇళ్లు, పరిసరాలతో పాటు నిర్మాణంలోని నీటి ట్యాంకులు, వ్యర్థాలు, పాత సామగ్రిని తనిఖీ చేసేవా రు. నీటి నిల్వలు తొలగించి, దోమల మందు పిచికారీ చేసేవారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో సహజంగానే బయటి వాతావరణంలో పలు రకాలుగా నీటి నిల్వలు పెరిగాయి. ముఖ్యంగా వినియోగంలో లేని భవనాలు, నిర్మాణంలో ఉన్న కట్టడాల వద్ద దోమ లు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణలో ఫాగింగ్ ప్రధానం. మున్సిపాలిటీల పరిధిలో ఫాగింగ్ యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ వాటి సేవలను ఇంతవరకు వినియోగించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా రికార్డుల్లో మాత్రం ఎప్పటికప్పు డు దోమల నివారణ చర్యలు చేపడుతున్నట్లు నమోదు చేస్తుండటం కొసమెరుపు. ఇదిలా ఉండగా పంచాయ తీలు, మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు లేకపోవడం కూ డా పారిశుధ్యం లోపించడానికి కారణమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటంతో ముం దు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
క్లోరినేషన్ ఏదీ...?
ప్రజలు తాగే రక్షిత మంచినీటి ట్యాంకుల్లోనూ క్లోరి నేషన్ చేసిన దాఖలాలు కానరావడం లేదు. నిలువ నీరు ఉన్నచోట లార్వా వృద్ధి చెందే అవకాశాలు అనేకం ఉంటాయి. క్లోరినేషన్ చేయడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వీధు ల్లోని నాలాల్లో సైతం బ్లీచింగ్ చేసిన పాపాన పోవడం లేదు. నీరు నిలువ ఉండే చోట్ల బ్లీచింగ్ చేస్తే ఆదిలోనే లార్వా అంతమై దోమల బెడద తగ్గుతుంది. ఆ చర్యలు కూడా మున్సిపాలిటీల్లో చేపట్టడం లేదు. దీంతో సా యంత్రం వేళ్లలో లైట్లు వేయగానే నాలాల్లో ఉన్న దోమలన్నీ ఇళ్లలోకి చేరుతున్నాయి. గుంపులు గుంపులు గా వస్తున్న దోమల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు....
పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. దోమకాటు వల్ల మలే రియా, డెంగ్యూ, చికన్ గున్యా లాంటి విష జ్వరాలు సోకుతాయి. ముఖ్యంగా పగలు కుట్టే దోమల పట్ల ప్ర జలు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. అవి కుడితే డెంగ్యూ, చికన్ గున్యా వంటి తీవ్రమైన జ్వరాలు సోకుతాయి. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆ స్పత్రులలో జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది. ప్రస్తుతానికి వైరల్ జ్వరాలతో ప్రజలు బాధ పడుతున్నప్పటికీ దోమల కారణంగా విష జ్వరాలు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయని కారణంగా నీరు కలుషితమై అతిసార ప్రభలే ప్రమాదం కూడా పొంచి ఉంది. అధికారుల వైఖరిపట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్...
విపరీతంగా పెరిగిన దోమల కారణంగా ప్రజలు ఆనారోగ్యాల భారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రస్తుతం 18 మంది జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు. పగలు కుట్టిన దోమల కారణంగా జిల్లాలో ఇద్దరు డెంగ్యూ భారిన ప డ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నప్పటికీ డెం గ్యూ బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుం దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో ఇద్దరు మలేరియా భారిన పడగా, శుక్రవారం వారిరు వురూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
పల్లెలే నయం....
పారిశుఽధ్య చర్యలు మున్సిపాలిటీలతో పోలిస్తే పల్లె ల్లోనే కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పంచాయతీల్లో ఫాగింగ్, క్లోరి నేషన్, బ్లీచింగ్ తదితర పనులు చేపట్టారు. వీధుల్లో మొలిచిన పిచ్చిగడ్డిని తొలగించడం, డ్రైనేజీలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతు న్నారు. డ్రైనేజీల్లో లార్వా వృద్ధి చెందకుండా ఉండేందు కు ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు అధికారులు చెబుతు న్నారు. ఆయిల్ బాల్స్ నీటిలో వేయగానే చమురు విస్తరించి, ఆ పరిసరాల్లో దోమల అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుంది. తద్వారా గ్రామాల్లో దోమల నివారణకు దోహదపడుతోంది. అయితే ఆ ప్రక్రియంతా కేవలం గ్రామాలకే పరిమితం కావడం గమనార్హం. గ్రామాల్లో చేపడుతున్న దోమల నివారణ చర్యలేవీ ప్రస్తుతం మున్సిపాలిటీల్లో అమలు కావడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.