ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:42 PM
ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నిం గ్‌వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్య లు తెలుసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు.
జన్నారం, జూలై8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నిం గ్‌వాక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్య లు తెలుసుకుంటూ అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండలం లోని పొన్కల్ గ్రామంలో మార్నింగ్‌వాక్ కార్యక్రమాన్ని (పొద్దుపొడుపు బొజ్జ న అడుగు) కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజీల స మస్య, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు సమస్యతో పాటు ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు వినడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. ము ఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రాని వారికి రాలేదన్న కొంత మంది ఫిర్యా దుల మేరకు వారికి రెండో విడతలో ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయని విధంగా సంక్షే మ పథకాలను శ్రీకారం చుట్టి ఆచరణలో పెడుతుందన్నారు. తన ఐదేళ్ల కా లంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు లేకుండా చూస్తా నని హామీ ఇచ్చారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనా రాయణ, కాంగ్రెస్ నాయకులు ముజాఫర్ అలీ, సయ్యద్ ఫసియుల్లా, మోహ న్‌రెడ్డి, ఇసాక్, నందు నాయక్, ఇంధయ్య, రమేశ్, సుధీర్, గంగన్నయాదవ్‌తో పాటు పాల్గొన్నారు.