మున్సిపల్ ఎన్నికలకు మరింత సమయం...!
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:27 PM
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26వ తే దీతో ముగిసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా మున్సి పల్ ఎన్నికలకు మోక్షం కలగకపోగా, మరింతగా ఆల స్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీం తో మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో పని చే స్తున్నాయి.
-జనవరిలో ముగిసిన పాలకవర్గాల పదవీకాలం
-ప్రత్యేకాధికారుల పాలనలో నడుస్తున్న బల్దియాలు
-పంచాయతీ ఎన్నికలు ముగిస్తేనే మార్గం సుగమం
-కార్పొరేషన్ ఎన్నికలు ఇక వచ్చే ఏడాదే
మంచిర్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 26వ తే దీతో ముగిసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా మున్సి పల్ ఎన్నికలకు మోక్షం కలగకపోగా, మరింతగా ఆల స్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీం తో మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో పని చే స్తున్నాయి. ఇదిలా ఉండగా పరిషత్, పంచాయతీ ఎన్ని కలు ముగిసిన తరువాతనే మున్సిపల్ ఎలక్షన్లు నిర్వ హించనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగులో ఉండటంతో పరిషత్, పంచాయతీ ఎన్నికల నిర్వణలో జాప్యం జరుగుతోంది. దీంతో ఆ ఎన్నికలు ఆలస్యం అ య్యే అవకాశాలు ఉండగా, వాటి తరువాతనే మున్సి పల్ పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి.
గడువుకు ముందే ముగిసిన పదవీకాలం....
జిల్లాలో మంచిర్యాల (ప్రస్తుతం మున్సిపల్ కార్పొరే షన్), నస్పూర్, చెన్నూర్, లక్షెట్టిపేట, మందమర్రి, క్యా తనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. మంద మర్రి మున్సిపాలిటీ 1/70 ఏజెన్సీ చట్టం పరిధిలో ఉం డటంతో అక్కడ దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించ డంలేదు. దీంతో అధికారుల పాలనలోనే మున్సిపాలిటీ నడుస్తోంది. బల్దియాలకు చివరిసారిగా 2020లో ఎన్ని కలు జరిగాయి. వాస్తవానికి మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం ఐదేళ్లపాటు ఉంటుంది. అందుకు భిన్నంగా నస్పూర్, మంచిర్యాల మున్సిపాలిటీలలో పాలక వర్గాల పదవీకాలం ఊహించని విధంగా నాలుగేళ్లకే మగిసిం ది. మంచిర్యాల నియోజకవర్గంలో కిందటి సంవత్సరం రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన నియోజకవర్గంలోని ము న్సిపాలిటీలపై దృష్టిసారించారు. అప్పటిదాకా బీఆర్‌ఎస్ పాలకవర్గాలు ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో సభ్యులంతా అధికార పార్టీలోకి వెళ్లారు. దీంతో ని యోజక వర్గంలోని నస్పూర్, మంచిర్యాల, లక్షెట్టిపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు అవిశ్వాస తీర్మాణాలు ప్రవేశపెట్టారు. అనుకున్న విధం గానే మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం కాగా అప్పటి వరకు బీఆర్‌ఎస్ చైర్మన్లుగా కొన సాగిన పెంట రాజయ్య, ఈసంపెల్లి ప్రభాకర్‌లు బలని రూపణలో వెనుకబడటంతో నాలుగేళ్లకే పదవీచ్యుతులు అయ్యారు. వీరు నిర్ణీత గడువుకు ఏడాది ముందే అనూ హ్యంగా పదవులు కోల్పోవలసి వచ్చింది. వారి స్థానం లో రావుల ఉప్పలయ్య (మంచిర్యాల), సురిమిల్ల వేణు (నస్పూర్) చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే వైస్ చైర్మన్లుగా కొనసాగిన గాజుల ముకేష్‌గౌడ్ (మం చిర్యాల), తోట శ్రీనివాస్ (నస్పూర్)ల స్థానంలో సల్ల మహేష్(మంచిర్యాల), గెల్లు రజిత (నస్పూర్)లు పద వీ బాధ్యతలు చేపట్టారు. అవిశ్వాస తీర్మాణాల కారణం గా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు నాలుగేళ్లకే పదవుల్లో నుంచి తప్పుకోవలసి రా గా, కొత్తగా నియమితులైన వారు ఒక సంవత్సరం పా టు పదవులను అలంకరించారు. ఇదిలా ఉండగా లక్షె ట్టిపేట మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసం వీగిపోయినందున 2020లో చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన బీఆర్‌ఎస్ నా యకులు నల్మాసు కాంతయ్య, పోడేటి శ్రీనివాసగౌడ్ పూర్తికాలం పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.
కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే ఏడాదే....!
జిల్లాలోని లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీల ఎన్నికలకు ఇప్పటికే మోక్షం లభిం చాల్సి ఉండగా, పరిషత్, పంచాయతీ ఎలక్షన్ల నిర్వహ ణతో వాటికి ముడిపడి ఉంది. పై రెండు ఎన్నికలు ని ర్వహిస్తే తప్ప మున్సిపల్ ఎలక్షన్లకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు లేవు. పరిషత్, పంచాయతీ ఎన్ని కలు చెరో రెండు నెలల సమయం తీసుకున్నా.... ము న్సిపల్ ఎన్నికలు 2026లోనే జరిగే అవకాశాలు అ ధికం గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా మూడు నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అ వకాశాలు చాలా తక్కువ. ఇదిలా ఉండగా మంచిర్యా ల మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు మాత్రం వచ్చే ఏడా ది చివరి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర వ్యా ప్తం గా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాతనే కార్పొరే షన్ల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు మార్చిలోగా జరిగితే కార్పొరేషన్ ఎలక్షన్ల నిర్వహణకు ఆ తరువాత మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. అంటే ఇప్పటి నుంచి సరిగ్గా ఏడాది తరువాతనే మున్సిపల్ కార్పొరేషన్ల జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మం చిర్యాల మున్సిపాలిటీకి దాదాపు 20 నెలల పాటు పాల క వర్గం లేకుండానే పరిపాలన కొనసాగనుంది. మంచి ర్యాల మున్సిపాలిటీ నగర పాలక సంస్థగా మారినం దున రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్‌లతో పాటే పాలక వర్గాల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో మంచి ర్యాల మున్సిపల్ పాలకవర్గం ముగిసి ఎనిమిది నెలలు కావస్తుండగా, కార్పొరేషన్‌గా మారి నందున పాలక వ ర్గం ఏర్పాటుకు మరో ఏడాది సమయం పట్టనుంది.