Share News

kumaram bheem asifabad- కాగజ్‌నగర్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు హాల్టింగ్‌

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:14 PM

కాగజ్‌నగర్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు హాల్టింగ్‌ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని సిర్పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వయి హరీష్‌బాబు అన్నారు. గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం హాల్టింగ్‌ను రైల్వే అధికారులు ఇచ్చారు.

kumaram bheem asifabad- కాగజ్‌నగర్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు హాల్టింగ్‌
యశ్వంత్‌పూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు హాల్టింగ్‌ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని సిర్పూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వయి హరీష్‌బాబు అన్నారు. గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఆదివారం హాల్టింగ్‌ను రైల్వే అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే హరీష్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో మరిన్ని సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఆగేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 18న వందేభారత్‌ సూపర్‌ ఫాస్ట్‌ హాల్టు కాగజ్‌నగర్‌ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టెలికాం అడ్వయిజరీ కమిటి సభ్యుడు ప్రభాకర్‌ గౌడ్‌, బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అసెంబ్లీ కన్వీనర్‌ వీరభద్రచారి, మాజీ కౌన్సిలర్‌ సిందం శ్రీనివాస్‌, అరుణ్‌ లోయా, చిలువేరు ప్రవీణ్‌; పవన్‌ బల్దువా, చిప్పకుర్తి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ వీడియో గ్రాఫ్‌ర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌ నార్సింగలో నిర్వహించే ఫొటో ఎక్స్‌పో పోస్టర్లను ఎమ్మెల్యే హరీష్‌బాబు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్‌పో ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఙానం, ఆధునిక పరికరాలపై ఫొటో గ్రాఫర్స్‌ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫొటో, వీడియో అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:14 PM