V Hanumantha Rao: హైడ్రాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:47 AM
హైడ్రాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వాలని, అలా ఇస్తే కబ్జా అయిన అసైన్డ్ భూములూ బయటికి వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాద్‌లో...
హైడ్రాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇవ్వాలని, అలా ఇస్తే కబ్జా అయిన అసైన్డ్ భూములూ బయటికి వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా ఇప్పటికే రూ. 15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడిందన్నారు. దీన్ని చూసి తట్టుకోలేని ప్రతిపక్షాలు.. పేదోళ్ల ఇళ్లను హైడ్రా కూల్చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఒకవేళ పేదోళ్ల ఇళ్లు కూలగొట్టాల్సి వస్తే వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని వి.హనుమంతరావు గుర్తుచేశారు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న వారికి చెంపపెట్టు వంటిదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని వారు తెలిపారు.