Chairman M Kodandareddy: రైతులకు శ్రీరామరక్షగా మనీ లెండింగ్ చట్టం
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:05 AM
రాష్ట్రంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడటానికి ప్రభుత్వం మనీ లెండింగ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని రాష్ట్ర వ్యవసాయ...
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడటానికి ప్రభుత్వం మనీ లెండింగ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తెలిపారు. పంటల పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రైతులు అప్పులు తెచ్చి నష్టపోతున్నారని.. అవి కట్టలేక చివరికి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో మనీ లెండింగ్ చట్టం-1349 అమలు కావటం లేదన్న విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. రైతు కమిషన్ సూచన మేరకు.. ఆ చట్టం అమలుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
ఆ విషయాన్ని సీఎంతో చర్చిస్తా: చామల
అమెరికాలోని తెలుగు వారు తమ సొంతూళ్లలోని సమస్యలను తీర్చేందుకు ఒక వ్యవస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని చెప్పారు. అమెరికాలోని పెన్సిల్వేనియా హారి్‌సబర్గ్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు మెకానిక్స్‌బర్గ్ వెళ్లిన చామల.. సోమవారం అక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.