Share News

kumaram bheem asifabad- పైసా పాయే.. పదవి రాకపాయే..

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:26 PM

ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే భావనతో మూడు విడతల్లో పోటీకి దిగిన పలువురు ఓటమి చెందడంతో డీలా పడ్డారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆయా పంచాయతీల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సర్పంచ్‌ బరిలో నిలిచారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకునే విధంగా మారాయి. ఒకప్పుడు రూ. లక్ష, రెండులక్షలతో అయిపోయే పంచాయతీ ఎన్నికలు నేడు భారంగా మారాయి.

kumaram bheem asifabad- పైసా పాయే.. పదవి రాకపాయే..
లోగో

- ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆవేదన

వాంకిడి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే భావనతో మూడు విడతల్లో పోటీకి దిగిన పలువురు ఓటమి చెందడంతో డీలా పడ్డారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆయా పంచాయతీల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సర్పంచ్‌ బరిలో నిలిచారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బులను నీళ్లలా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బుతో కూడుకునే విధంగా మారాయి. ఒకప్పుడు రూ. లక్ష, రెండులక్షలతో అయిపోయే పంచాయతీ ఎన్నికలు నేడు భారంగా మారాయి. చిన్న పంచాయతీలైతే కనీసం నాలుగు లక్షలు, పెద్ద పంచాయతీ అయితే రూ. 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని పంచాయతీల్లో వార్డులకు రూ. లక్షల్లో ఖర్చు చేశారు. ఆర్థికంగా ఉన్న అభ్యర్థులకు ఫర్వాలేకున్నా.. మధ్య తరగతి కుటుంబాలు, పేద కుటుంబాల నుంచి అనేక మంది బరిలో నిలిచారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా గిరిజనులే పోటీ చేయాల్సి ఉంది. గిరిజనుల్లో ఎక్కువగా పేదవారే ఉంటారు. రిజర్వేషన్ల వల్ల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పేదలే సర్పంచ్‌గా బరిలో నిలిచారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పార్టీల నాయకులు కూడా గెలిచే అభ్యర్థులు మీరే అంటూ బరిలోకి దింపారు. తీరా బరిలో నిలిచిన తరువాత ఖర్చు చేయక తప్పని పరిస్థితి. ఎలాగైనా గెలవాలి. గెలిస్తే ఆ తరువాత ఆర్థికంగా లాభపడవచ్చు అన్న ఆలోచనతో అనేక మంది లక్షలకు లక్షలు ఖర్చు చేశారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ పొలాలను అమ్మికొందరు, ఎకరం రెండు ఎకరాలను తాకట్టు పెట్టి మరికొందరు...అప్పటికప్పుడు ఇళ్లస్థలాలు అమ్మి ఇంకొందరు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అనేక మంది నగదును సమ కూర్చి ఎన్నికల్లో డబ్బులను నీళ్లల్లా ఖర్చు చేశారు. పోటాపోటీగా ఓటుకు రూ. 500 నంచి రూ. 3 వేల వరకు, పోటీ బాగా ఉందనుకుంటే రూ. 5 వేల వరకు ఇచ్చారు. మద్యం, ప్రచారానికి రూ. లక్షలు ఖర్చు చేశారు. పోలింగ్‌ కంటే ముందురోజు చికెన్‌, చీరలు, గాజులు బహుమతులు కూడా పంపిణీ చేశారు. ఎలా గైనా గెలవాలనే లక్ష్యంతో అప్పులను కూడా చూసుకోకుండా కొందరు అభ్యర్థులు డబ్బులను వెదజల్లారు. తీరా ఓడిపోయి ఇప్పుడు అప్పులపాలయ్యారు.

గెలిచిన అభ్యర్థులు..

పంచాయతీ బరిలో నిలిచి విజయం సాధించిన అభ్యర్థులు తమ పాలనలోని ఐదేళ్లలో ఎలాగైనా తాము ఖర్చుచేసిన డబ్బును రాబట్టుకోవచ్చనే ఆలోచనతో ఉంటే..ఓడిపోయిన అభ్యర్థులు కొందరు మాత్రం ఆర్థికంగా చితికి తీవ్ర మనోవేదనలో ఉన్నారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసిన కొందరు తమ కుటుంబానికి ఆసరగా ఉండే పొలాలను కూడా విక్రయించడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన ఖర్చు రూపాయి కూడా వెనక్కిరాని పరిస్థితి ఉండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ఓటమి, మరోవైపు అప్పులు.. ఫలితం గా ఏమి చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఓడిన అభ్యర్థుల్లోనూ కొందరు ఆర్థికంగా ఉన్న వారు కావడంతో .. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాగా పంచాయతీ బరిలో నిలిచి ఓడిపోయిన కుటుంబాల్లో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా యువత పోటీ చేసింది. రిజర్వేషన్ల వల్ల భార్యలకు ఇష్టం లేకున్నా భర్తలు బరిలో నిలిచారు. కుంటుబసభ్యులు అయిష్టంగగా ఉండడానికికారణం ఆర్థిక ఇబ్బందులే. కొన్ని చోట్ల పార్టీల నాయకులు సాయం చేస్తామంటూ అభ్యర్థులను బరిలో దింపారు. నామినేషన్ల నాటకి పరిస్థితి పోలింగ్‌ నాటి పరిస్థితికి ఎంతో తేడా ఉంది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసి ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఖర్చు చేస్తే కొందరిని అదృష్టం వరిస్తే... మరికొందరిని అపజయం వెంటాడింది. దీంతో వద్దన్నా పోటీలో ఉండి రూ. లక్షలు ఖర్చు చేసి అప్పులపాలు చేశావంటూ ప్రశ్నిస్తుండడంతో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు డబ్బు తీసుకుని ఓట్లు వేయని ఓటర్లపై దృష్టిసారించి టార్గెట్‌ చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఓడిపోయిన అభ్యర్థులు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పలువురిని ఒత్తిడి తీసుకవస్తున్నారని, ఇళ్లకు తిరుగుతున్నట్లు సమాచారం. ఓటర్లు ఇరువైపులా డబ్బులు తీసుకుని ఓటు ఒకరికి వేయడంపై సైతం పలుచోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి.

Updated Date - Dec 22 , 2025 | 11:26 PM