Telangana minister Mohammed Azaruddin: అజారుద్దీన్‌కు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:25 AM
ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల..
శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ఆయనకు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటివరకు మైనారిటీ సంక్షేమ శాఖ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్ద, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ.. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉండేవి. అజారుద్దీన్ మంత్రిగా అక్టోబరు 31న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.