పంటలకు ఎంఎస్‌పీని పెంచిన ఘనత మోదీదే
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:31 PM
రైతుల పండించిన ఎన్నో పంటలకు ఎన్నో సార్లు ఎంఎస్‌పీని పెంచిన ఘనత ప్రధాని నరేం ద్రమోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రాంచందర్‌రావు
లక్షెట్టిపేటలో రైతు సమ్మేళన సభ
లక్షెట్టిపేట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రైతుల పండించిన ఎన్నో పంటలకు ఎన్నో సార్లు ఎంఎస్‌పీని పెంచిన ఘనత ప్రధాని నరేం ద్రమోదీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. లక్షెట్టిపేటలోని ఎస్‌పీఆర్ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పక్ష పాతి నరేంద్రమోదీ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమాన్ కింద నెలకు రూ.6వేలు క్రమం తప్పకుండా రైతు ల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమ చేస్తోందన్నారు. వ్యవసాయ సం క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని తెలి పారు. మొదటి సారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రైతు లకు మాయ మాటలు చెప్పి నట్టేట ముంచిందన్నారు. రైతుల ఆ త్మహత్యలు బీఆర్‌ఎస్ పాలనలోనే పెరిగాయన్నారు. ఇక ఇప్పు డున్న కాంగ్రెస్ పార్టీ రైతులను అవసరానికి వినియోగించు కునేం దుకు చూస్తుందని స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మొన్నటికి మొన్న రైతులకు రైతు బందు ఇచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి 15వేలు ఇస్తానని రైతు బందు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులకు కేంద్రం నుంచిపూ ర్తిస్థాయిలో యూరియా వస్తుందని కానీ కేంద్రం పంపించడం లే దని ఆరోపించడం సరికాదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులే బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. స్థానిక కరీంనగర్ చౌరస్తాలో గల శ్రీచత్రపతి శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ఎండ్ల బండ్లతో ర్యాలీగా సభా ప్రాంగ ణానికి చేరుకున్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్న మైల్ అంజిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాత్, మా జీ ఎంపీ వెంకటేశ్‌నేత, పార్టీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరి గోపాల్‌రావు, మండల అద్యక్షుడు హేమంత్‌రెడ్డి, గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు,
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
మంచిర్యాల కలెక్టరేట్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇ చ్చిన హామీలను విస్మరించి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుం దని బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్ర త్యామ్నాయంగా బీజేపీని ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ఆసక్తితో ఉన్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో దేశం పు రోగమిస్తుందని దానికి పదకొండేళ్లలో 12లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి జాతీయ రహదారులను, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే అన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని తద్వారా రాష్ట్రంలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీ జేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, మాజీ ఎంపీ వెం కటేశ్‌నేత, పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజుకుమార్, పాల్గొన్నారు.