Share News

kumaram bheem asifabad- జిల్లాలో మోస్తరు వర్షం

ABN , Publish Date - Oct 29 , 2025 | 10:52 PM

జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మరో రెండు మూడు రోజుల వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

kumaram bheem asifabad- జిల్లాలో మోస్తరు వర్షం
దహెగాంలో నేలకొరిగిన వరి పంట

ఆసిఫాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో మరో రెండు మూడు రోజుల వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలు, పత్తి తీత పనులు చేపడుతున్న రైతులకు తుఫాన్‌ ప్రభావంతో నష్టం వాటిల్లనుంది. సిర్పూర్‌(టి)లో అత్యధికంగా 32.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగజ్‌నగన్‌లో 22.8, కౌటాలలో 22.3, ఆసిఫాబాద్‌లో 14.0, రెబ్బెనలో 12.0, లింగాపూర్‌లో 11.5, వాంకిడిలో 10.8 , బెజ్జూరులో 10.0, తిర్యాణిలో 8.8, సిర్పూర్‌ (యూ), జైనూరు మండలాల్లో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. మండల వ్యాప్తంగా 25 వేల ఎకరాల్లో పత్తి, పది వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. పత్తి ఏరివేత దశలో వర్షాలు కురుస్తుండడంతో డిసి పోయి నేల పాలు అవుతుందని వాపోతున్నారు. అలాగే వరి పైరు కోత దశలో ఉండడంతో ఈదురుగాలులకు నేల పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో మండలవ్యాప్తంగా బుధవారం మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్‌ ప్రభావం కారణంగా మబ్బులు కమ్ముకున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో పత్తి, వరి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 10:52 PM