kumaram bheem asifabad- జిల్లాలో మోస్తరు వర్షం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:04 PM
జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం చింతలమానేపల్లి మండలం ఉదయం నుంచి మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో కేతిని-దిందా గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
చింతలమానేపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం చింతలమానేపల్లి మండలం ఉదయం నుంచి మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో కేతిని-దిందా గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని, తెగుళ్లు సోకి పంట దిగుబడిపై ప్రభావం చూపుతోందని రైతులు చెబుతున్నారు.
బెజ్జూరు.(ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో బుధవారం రాత్రి నుంచి ఏకదాటిగా మురుసు వాన కురుస్తోంది. ఏకదాటి కురుస్తున్న వానతో రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న వర్షం వరి పంటకు మేలు చేకూరేలా ఉన్నప్పటికీ పత్తి పంటకు మాత్రం ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు రైతులు తెలుపుతున్నారు. పత్తి పూత కాయ రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా మండలంలోని పోతెపల్లి గ్రామంలో ఏలేశ్వరం వెంకటేష్ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా గురువారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. లక్మాపూర్, అనార్‌పల్లి వాగు పొంగడంతో వాగు అవతల ఉన్న పది గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మెట్టపిప్పిరి, కేలి(బి) గ్రామాల్లోని లోలెవల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట దిగుబ డి గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం రాత్రి నుంచి వర్షం కురిసిం ది. వరదనీరు కాలనీల్లో చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రోజంతా వర్షం పడడంతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగింది. ముసురు వర్షానికి అంతర్గత రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడ్డారు.