MLC Pingali Sripal Reddy: టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వండి
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:40 AM
ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.
కిషన్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి కాకుండా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఆదివారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్‌తో కలిసి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి సమస్యను వివరించి, పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే దీర్ఘకాలికంగా ఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు ఇప్పిస్తానని అన్నారు. రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి కేంద్రం అదనపు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కోరగా.. విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానని కిషన్‌రెడ్డి తెలిపారు.