వినూత్నంగా ఎమ్మెల్యే వివాహ వార్షికోత్సవం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:38 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్‌ఆర్) దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించుకున్నారు.
అరకులో ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ దంపతులు
మిర్యాలగూడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బీఎల్‌ఆర్) దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించుకున్నారు. తమ 32వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీన కుటుంబ సభ్యు లతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయకు వెళ్లిన ఎమ్మెల్యే దంప తులు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసి గూడెంలో గిరిజన సంప్రదాయ రీతిలో తమ పెళ్లిరోజు వేడుకను నిర్వహించుకున్నారు. అనుకోని అతిథిలుగా తమ గూడేనికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులను గిరిజనులు తమ సంప్రదాయ బూరలు ఊది, భేరీలు మోగించి నృత్యాలు చేస్తూ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తమ ఆచారం, సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే బీఎల్‌ఆర్, ఆయన సతీమణి మాధవిని వరుడు, వధువుగా, ముస్తాబు చేసి పెళ్లితంతు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు సంబంధిత వీడియోను గురువారం మిర్యాలగూడ వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఎమ్మెల్యే దంపతుల వెంట పెద్ద కుమారుడు సాయిప్రసన్న, కోడలు వెన్నెల ఉన్నారు. ఇటీవల తన కుమారుడి వివాహం అనంతరం రిసెప్షన్‌ను రద్దు చేసి సీఎం సహాయ నిధికి రూ.2కోట్లు విరాళం ఇచ్చి, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్ తన వివాహ వార్షికోత్సవాన్ని ఆదివాసీలతో కలిసి నిర్వహిం చుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కారు.