ఇచ్చిన హామీలను మర్చిపోయిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:49 PM
చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వివేక్‌వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు పట్ట ణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ అబద్దాలను ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిందన్నారు.
చెన్నూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వివేక్‌వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు పట్ట ణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ అబద్దాలను ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిందన్నారు. వివేక్‌వెంకటస్వామి గెలిచిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని ఎద్దేవా చేశారు. చెన్నూరు పట్ట ణంలో వంద పడకల ఆసుపత్రి, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, మినీ స్టేడియం, మహిళ భవనం, సీసీ రోడ్లు, తాగునీటి వంటి పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయని మండిపడ్డారు. చెన్నూరు పట్టణంలో నిలిపివేసిన అభివృద్ధి ప నులను పూర్తిస్థాయిలో చేయకపోతే త్వరలోనే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రజలందరు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని, మూడ వ విడత పంచాయతీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని గ్రా మాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.