Share News

MLA Madhavaram Krishnarao: సర్వే చేయాలని నేనూఅడుగుతున్నా

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:16 AM

ఐడీపీఎల్‌ భూముల్లో ఆక్రమణలకు పాల్పడింది ఎవరో.. సర్వే చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని తాను కూడా.....

MLA Madhavaram Krishnarao: సర్వే చేయాలని నేనూఅడుగుతున్నా

  • ఆక్రమణలకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలియాలి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్‌పల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఐడీపీఎల్‌ భూముల్లో ఆక్రమణలకు పాల్పడింది ఎవరో.. సర్వే చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని తాను కూడా అడుగుతున్నానని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ‘రూ.4000 కోట్ల ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. పరిశ్రమ భూముల అన్యాక్రాంతంలో తన ప్రమేయం లేదని.. భూములు ఆక్రమించుకుని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తానే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. పేదలు వేసుకున్న గుడిసెలు ఐడీపీఎల్‌ భూముల్లో ఉంటే.. పేదలకు ఆ స్థలాలు కేటాయించి, ప్రతిగా ప్రభుత్వం టీడీఆర్‌ బాండ్లు పరిశ్రమకు ఇవ్వాలని కోరారు. దిల్‌కుష్‌ నగర్‌లో 50 ఏళ్లుగా రోడ్డు లేక ఓ గర్భిణి ఆస్పత్రికివెళుతూ మృతి చెందారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకే ఆ ప్రాంతంలో రోడ్డు వేశామన్నారు. చట్టపరంగా తప్పు ఉంటే ఏ చర్య తీసుకున్నా అభ్యంతరం లేదన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 04:16 AM