Share News

MLA Nayini Rajender Reddy: ఎవరి పరిధిలో వారుండాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:48 AM

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి..

MLA Nayini Rajender Reddy: ఎవరి పరిధిలో వారుండాలి

  • నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ధర్మకర్తలను నియమిస్తారా?: ఎమ్మెల్యే నాయిని

వరంగల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి.. ‘‘పెద్దలు ఎవరి పరిధిలో వారుండాలి.. నా నియోజకవర్గంలో ఉన్న గుడికి నాకు తెలియకుండా ధర్మకర్తలను వేయడం.. ఇతర విషయాల్లో నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదు..’’ అని విమర్శించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి శుక్రవారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయానికి తాజాగా మరో ఇద్దరు ధర్మకర్తలను నియమిస్తూ జీవో జారీ కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

Updated Date - Sep 13 , 2025 | 04:48 AM