Share News

MLA Madhavaram Krishna Rao: నువ్వు జైలుకు ఎందుకెళ్లావ్‌?

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:30 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.....

MLA Madhavaram Krishna Rao: నువ్వు జైలుకు ఎందుకెళ్లావ్‌?

  • నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు

  • నీ భర్తకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడివి?

  • బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు

  • హరీశ్‌ను పంపేయాలని, కేటీఆర్‌ను అరెస్టు చేయించాలని కుట్రలు

  • నీలాంటి కుక్కలు చాలా మొరుగుతుంటాయి

  • కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్‌

కూకట్‌పల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నుంచి హరీశ్‌రావును బయటికి పంపించేందుకు, రేవంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ను అరెస్టు చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్‌ఎ్‌సలో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలనుద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమపై ఆరోపణలు చేసే కవిత.. జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. ‘‘తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను నాశనం చేయాలని చూస్తున్నావు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు దోచుకుతిన్నావు. రూ.1000కోట్ల భూకుంభకోణం చేశావు. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని, ఇప్పుడు రేవంత్‌ను అడ్డం పెట్టుకొని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడివి? బాలానగర్‌ ఐడీపీఎల్‌లో సర్వే నంబర్‌ 21, 22లో 36ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది?’’అని కృష్ణారావు ధ్వజమెత్తారు. బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉందన్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటు అని, ఈనాలుగు రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసుని చెప్పారు. ‘‘తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారు. మేం టీడీపీ నుంచి గెలిచాం. నువ్వు అనుకునే పార్టీ నుంచి కాదు. పదేళ్లలో నేనేం చేశానో కూకట్‌పల్లి ప్రజలకు తెలుసు. నీ ముఖానికేం తెలుసు? నీలాంటి కుక్కలు చాలా మొరుగుతుంటాయి. మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీ చిట్టా విప్పుతా. నీవల్ల ఎంతమంది బలయ్యారో బయటపెడతా’’అని హెచ్చరించారు.

Updated Date - Dec 10 , 2025 | 04:30 AM