Akbaruddin Owaisi: వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి: అక్బరుద్దీన్
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:20 AM
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా 2025-26 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు.

హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా 2025-26 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. ఫలితంగా నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సరిపడా సమయం దొరుకుతుందన్నారు. శాసనసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీలో ఆశించిన పురోగతి లేదని, దీనిపై సర్కారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతి నుంచే రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించినా.. ఇప్పటికీ అమలులోకి రాలేదని గుర్తు చేశారు. చార్మినార్ వద్ద అభివృద్ధి ఇప్పటికీ పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు అప్పటి స్పీకర్ చార్మినార్ ప్రాంతం మారబోతుందని చెప్పారని, ఇప్పుడు తన జుట్టు తెల్లబడినా ఎలాంటి మార్పు జరగలేదని పేర్కొన్నారు.