kumaram bheem asifabad- ఉపాధిహామీ లో నిధుల దుర్వినియోగం
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:53 PM
ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల్లో నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలం సమావేశ మందిరంలో 2045-25సంవత్సరంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు.
వాంకిడి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనుల్లో నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు వెల్లడించారు. మండల పరిషత్ కార్యాలం సమావేశ మందిరంలో 2045-25సంవత్సరంలో చేపట్టిన ఉపాధిహామీ పనులపై శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 28 గ్రామ పంచాయ తీలలో 69153228 కోట్ల పనులు చేపట్టగా జరిగిన పనులపై డీఆర్పీలు ఇటీవల చేసిన తనిఖీల్లో ఉపాధిహామీ పథకంలో రూ. 3,98,283 దుర్వినియోగం జరిగినట్లు ఎస్‌ఆర్‌పీ రవి వెళ్లడించారు. పలు గ్రామాల్లో పర్కులేషన్ ట్యాంక్‌లు నిర్మించినా వర్షాకాలంలో అవి కొట్టుకుపోవడం, మరి కొన్ని గ్రామాల్లో కుంటలను చదును చేసి రైతులు వ్యవసాయ పంటలు పండించడంతో నిధులు దుర్వినియోమైనట్లు తనిఖీ బృందం వెల్లడించింది. బినామి పేర్లతో కూలీల డబ్బులు కాజేయడం, అర్హులైన వారికి జాబ్‌కార్డులు ఇవ్వక పోవడం, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కొంత మంది మేట్లు సొంతంగా వాడుకోవడం, ఒక్కో ఇంట్లో రెండేసి జాబ్‌కార్డులు ఇవ్వడం లాంటి సంఘటనలు తనిఖీ బృందం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధిహామీ పనులు ప్రజలకు, రైతులకు ఉపయోగ పడేలా ఉండాలని ప్రజలకు అవసరమైన పనులను మాత్రమే చేపట్టాలని డీఆర్‌డీవో దత్తారాం ఈసందర్భంగా పేర్కొన్నారు. మండలంలో చేపట్టిన పనులపై టీఏ, ఎఫ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహారించడంవల్ల పనులు ఉపయోగకరంగా లేకుండా పోయాయని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించిన పర్కులేషన్ ట్యాంక్‌లను రైతులు చదును చేసి పత్తి పంటలు పండించారని అన్నారు. దీంతో లక్షల రూపాయలు వృధా అయ్యాయని చెప్పారు. ఎవరైతే రైతులు పీటీ ట్యాంకులను చదును చేసి పత్తి పంటలు వేశారో వారికి నోటీసులు జారి చేసి రికవరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధిహామీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన టీఏ, ఎఫ్‌ఏ, కార్యదర్శులకు రూ. 50 వేలు జరిమానా విధించడంతో పాటు 1,79, 499 నిధులకు సంబంధించిన పనులపై సిబ్బంది వివరణకు అధికారులు ఆదేశించారు. దుర్వినియోగ మైన రూ. 1,68, 784 నిధులను సంబంధిత టీఏ, ఎఫ్‌ఏ, కార్యర్శుల ద్వారా రికవరీ చేయనున్నట్లు అధికారులు అన్నారు. బినామి పేర్లపై కూలీ డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విధులకు గైర్హాజరవ ుతున్న సోనాపూర్ ఎఫ్‌ఏ చందును సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్ చంద్రశేఖర్, డీవీఓ అంజనేయులు, ఎస్‌టీఎం వేణు, అంబుస్‌మెన్ సాయి శ్రీ, ఎంపీడీఓ ఖాజాఅజీజోద్దిన్, ఈజీఎస్ ఏపీఎం శ్రావణ్, పీఏసీఎస్ చైర్మన్ జాబిరె పెంటు, ఎస్‌ఆర్‌పీ రవి ఉపాధిహామి సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.