Pink Power Run for Breast Cancer Awareness : రేపు నెక్లెస్ రోడ్‌లో పింక్ పవర్ రన్
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:00 AM
రొమ్ము క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాల్సిన అవసరముందని మిస్‌వరల్డ్ 2025 ఓపల్ సుచాతా అన్నారు..
పాల్గొననున్న మిస్ వరల్డ్ సుచాత, పలు దేశాల అందగత్తెలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రొమ్ము క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాల్సిన అవసరముందని మిస్‌వరల్డ్ 2025 ఓపల్ సుచాతా అన్నారు. ఈ వ్యాది పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లె్‌సరోడ్‌లో పింక్ పవర్ రన్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఓపల్ సుచాతతో పాటుగా ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా, కరేబియన్, ఓషియానా దేశాలకు చెందిన అందగత్తెలు హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తరువాత తన జీవితం ఎంతగానో మారిందన్న ఓపల్.. తన ప్రాజెక్ట్ ’ఓపెల్ ఫర్ హర్’ ద్వారా రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహనను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. చాలామంది తుది దశలో చికిత్సకు వస్తున్నారని, వ్యాధిపై అవగాహన పెంచడం కోసమే తాము పింక్ పవర్ రన్‌లో పాల్గొంటున్నామని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొననున్నారని ఫార్చ్యూన్ హాస్పిటాలిటీకి చెందిన డాక్టర్ రామకృష్ణ చెప్పారు.