Minor Crime: బ్యాంకులో 5 లక్షలు కాజేసిన బాలుడు!
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:32 AM
నిజామాబాద్ జిల్లా బోధన్ లోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లో చోరీ జరిగింది. ఈ నెల 8న బ్యాంకులో రూ.5 లక్షలు చోరీకి గురైనట్లు...
సీసీ కెమెరా ఫుటేజీతో నిర్ధారణ
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐలో ఘటన.. చోరీపై పోలీసుల దర్యాప్తు
ఈ నెల 8న ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
బోధన్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లా బోధన్ లోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)లో చోరీ జరిగింది. ఈ నెల 8న బ్యాంకులో రూ.5 లక్షలు చోరీకి గురైనట్లు క్యాషియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా బ్యాంకులోని సీసీ కెమెరాల ఫుటేజీని చూసిన పోలీసులు విస్తుపోయారు. ఓ బాలుడు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగ్గా.. బాలుడు నగదు కౌంటర్ వైపు వెళ్లాడు. ఆ బాలుడే రూ.5 లక్షలు చోరీ చేసినట్లు నిర్ధారించామని పోలీసులు చెబుతున్నారు. అతనికి సహకరించిన వారికోసం సీసీ ఫుటేజీల ద్వారా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై పట్టణ సీఐని వివరణ కోరగా.. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని, త్వరలోనే నిందితు లను పట్టుకుంటామని తెలిపారు.