Assault Attempt: బాలికపై యువకుడి లైంగికదాడి
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:35 AM
బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో జరిగింది...
మరో యువకుడి అత్యాచారయత్నం
100కు కాల్ చేసిన బాధితురాలు.. నిందితుల పరారీ
యాచారం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో జరిగింది. ఓ 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన గడల క్రాంతి అనే యువకుడు మాయమాటలు చెప్పి శనివారం రాత్రి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బి.క్రాంతికుమార్ అనే మరో యువకుడికి ఫోన్ చేసి చెప్పాడు. అతడు కూడా అక్కడికి చేరుకుని బాలికపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించి 100కు కాల్ చేసి సమాచారమివ్వడంతో నిందితులిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బీఎన్‌ఎ్‌స చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్సై మధు తెలిపారు.