Theft Attempt: బ్యాట్ కోసమే వెళ్లా.. అడ్డుకోవడంతో హత్య
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:17 AM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడైన మైనర్‌ను పోలీసులు జువెనైల్ హోంకు వెళ్లి విచారణ చేశారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతిస్తూ..
బాలిక సహస్ర హత్య కేసు నిందితుడి వెల్లడి
హైదరాబాద్‌సిటీ/సైదాబాద్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడైన మైనర్‌ను పోలీసులు జువెనైల్ హోంకు వెళ్లి విచారణ చేశారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతిస్తూ.. జువైనల్ హోంకే వెళ్లి విచారించాలని ఆదేశించింది. దాంతో కూకట్‌పల్లి ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌లు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, బాలుడితల్లితో కలిసి సైదాబాద్‌లోని జువెనైల్ హోంకు వెళ్లారు. అక్కడే కస్టడీలోకి తీసుకుని ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. తల్లిని వేరే గదిలో ఉంచి విచారించినట్లు తెలిసింది. క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడానికే సహస్ర వాళ్లింటికి వెళ్లానని, ఇంట్లో ఎవరూ ఉండరని భావించి కత్తితో తాళం తీయాలనుకున్నానని పోలీసుల విచారణలో చెప్పాడని తెలిసింది. కానీ సహస్ర ఒంటరిగా ఉండడం, తనను అడ్డుకుని.. ఆమె తండ్రికి చెప్తానని బెదిరించడంతో ఆవేశానికి లోనై కత్తితో పొడిచానని చెప్పాడని సమాచారం.