Ministers Ponguleti Srinivas Reddy: అతిథులకు ఇబ్బంది కలగొద్దు
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:22 AM
రాష్ట్ర భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కోసం అత్యంత ఆకర్షణీయమైన వేదిక ను ఏర్పాటు.....
మంత్రులు పొంగులేటి, పొన్నం
హైదరాబాద్/రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 కోసం అత్యంత ఆకర్షణీయమైన వేదిక ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట - బేగరికంచలోని భారత్ ఫ్యూచర్ సిటీలో సొమ, మంగళవారాల్లో నిర్వహించే సమ్మిట్ ఏర్పాట్లను వారు ఆదివారం పరిశీలించారు. ప్రాంగణమంతా కలియతిరిగి అతిథుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను దాదాపు రెండు గంటలపాటు పరిశీలించారు. సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక షెషన్లు నిర్వహించనున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ ఖ్యాతి ఖండాంతారాలు దాటడం ఖాయమని అన్నారు. సమ్మిట్ ఏర్పాట్లను మధ్యాహ్నం వరకు పరిశీలించిన మంత్రి పొంగులేటి... రాత్రి 8గంటలకు తిరిగి సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేశారు.