Share News

Minister vivek venkataswamy: కల్వకుంట్ల కుటుంబంతో ఖజానా ఖాళీ

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:54 AM

కల్వకుంట్ల కుటుంబం పాలనలో తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యిందని రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం...

Minister vivek venkataswamy: కల్వకుంట్ల కుటుంబంతో ఖజానా ఖాళీ

సిరిసిల్ల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కల్వకుంట్ల కుటుంబం పాలనలో తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యిందని రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సకల జనుల ఆధ్వర్యంలో మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి రాగుల రాములు అధ్యక్షతన మంత్రి వివేక్‌ వెంకటస్వామికి సిరిసిల్లలో బుధవారం సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, మళ్లీ కాంగ్రెస్‌ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 05:54 AM