Share News

మంత్రి వర్యా.. మీపైనే ఆశలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:38 PM

ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో సమస్యలు వెంటాడుతున్నాయి. నూతనంగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామి అయినా సమస్యల పరిష్కారం దిశ గా నడుస్తారా అన్న ఆశతో స్థానిక ప్రజలున్నారు.

మంత్రి వర్యా.. మీపైనే ఆశలు

నియోజకర్గంలో ఏళ్లుగా వెంటాడుతున్న సమస్యలు

-మంత్రిపైనే ప్రజల ఆశలు

-నేడు చెన్నూరుకు మంత్రి వివేక్‌ రాక

===================

చెన్నూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో సమస్యలు వెంటాడుతున్నాయి. నూతనంగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామి అయినా సమస్యల పరిష్కారం దిశ గా నడుస్తారా అన్న ఆశతో స్థానిక ప్రజలున్నారు. కార్మిక, మైనింగ్‌శాఖలు చేపట్టిన గడ్డం వివేక్‌ మంత్రి హోదాలో నేడు తొలిసారి చెన్నూరుకు రానున్నారు. ఇ రుకిరుకు రహదారులు, అసంపూర్తి డ్రైనేజీలు, తాగునీటికి తిప్పలు, మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు ఇ లా ఎన్నో సమస్యలు మంత్రికి సవాళ్లుగా నిలిచాయి.

తలాపునే గోదావరి..అన్నదాతకు కన్నీరే..

నియోజకవర్గం చుట్టూ తలాపున గోదావరి, ప్రాణ హిత నదులు ప్రవహిస్తున్నా అటు సాగునీరు, ఇటు తాగునీరు అందని దుస్థితి నెలకొంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పంటల సాగుకు మండలంలోని సుందరసాల, నర్సక్కపేట, సో మనపల్లి, కోటపల్లి మండలంలోని కొల్లూరు, అర్జునగు ట్ట, సిర్సా, జనగామ గ్రామాల సరిహద్దుల్లో గోదావరి, ప్రాణహిత నదులకు అనుసంధానంగా ఎత్తిపోతల ప్రా జెక్టులు నిర్మించి తాగునీరు అందించారు. కానీ బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు జరగ డంతో ఎత్తిపోతల పథకాలు మూలకు పడ్డాయి. ఇదిలా ఉంటే ప్రాజెక్టు పగుళ్లు తేలడంతో కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను మూసివేశారు. దీంతో గోదావరి అంతా చుక్క నీరు లేకుండా పోయింది. అటు కోట్లాది రూపాయలు వెచ్చించిన ఎత్తిపోతల పథకాలు మూల కు పడడం, ఇటు బ్యారేజీలు మూత పడడంతో సాగు నీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. తాగునీ రందించే మిషన్‌ భగీరథ నీరు సైతం నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు రాకపోవడంతో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తాయి.

పత్తాలేని ఆర్టీసీ డిపో.. రెవెన్యూ డివిజన్‌

చెన్నూరులో ఆర్డీసీ బస్‌ డిపో కలగానే మిగిలిపో యింది. డిపో నిర్మాణానికి భూమి కేటాయించి పను లు ప్రారంభమైనా సదరు స్థలం తమదేనంటూ కొంద రు కోర్టుకు వెళ్లడంతో పనులకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనిపై మంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు సైతం కాగితా లకే పరిమితమైంది. చెన్నూరులో రెవెన్యూ డివిజన్‌ ఏ ర్పాటు చేస్తే చుట్టు పక్కల మండలాల రైతులకు లబ్ది చేకూరేది.

-అందని మెరుగైన వైద్యం

ఆసుపత్రిలో ఇటు వైద్యుల కొరత, అటు సిబ్బంది కొరతతో సకాలంలో సరైన వైద్యం అందడం లేదని వి మర్శలు ఉన్నాయి. మూడు మండలాల గ్రామాలకు చె న్నూరే ప్రధాన కేంద్రం కావడం, గ్రామాల నుంచి రో గులకు సర్కారు వైద్యం అందక ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిపై మంత్రి దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణులు కోరుతున్నా రు. అలాగే మరో వైపు నిర్మాణంలో ఉన్న వంద పడ కల ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతు న్నాయి. త్వరగా పనులను పూర్తి చేసి ఆసుపత్రిని అం దుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక స మీకృత కూరగాయల మార్కెట్‌ చెన్నూరు నడిఒడ్డున దర్శనమిస్తోంది. ఇందులో సరైన సదుపాయాలు లేవని మార్కెట్‌ను తరలించడం లేదనే అభిప్రాయాలు ఉన్నా యి. వెంటనే మంత్రి దృష్టి పెట్టి సదుపాయాలు కల్పిం చి సమీకృత భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. లేదంటే అది అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారనుందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.

-నిత్యం ట్రాఫిక్‌ రద్దీ

పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌ నుంచి కోటపల్లి బ స్టాండ్‌ రాగిచెట్టు వరకు ప్రతీ రోజు, ప్రతి గంటకు ట్రా ఫిక్‌తో వాహనదారులు, బాటసారులు, విద్యార్ధులు ఇ బ్బందుల పాలవుతూనే ఉన్నారు. ఇకనైనా ఇరుకైన రోడ్డులో ఒక్క భారీ వాహనం లేక రెండు బస్సులు ఎ దురెదురుగా వస్తే గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ అవు తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఏర్పాటు చే సిన బైపాస్‌ రహదారి ఇంకా అందుబాటులోకి రాకపో వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి దీనిపై దృష్టి పెట్టి బైపాస్‌ రోడ్డును అందుబా టులోకి తీసుకువస్తే సమస్యకు పరిష్కారం దొరక నుంది.

-అటవీ శాఖ అనుమతులు వస్తే

మారుమూల మండలాల్లోని గ్రామాల్లో అటవీ శాఖ అనుమతులు లేక పలు రహదారుల నిర్మాణం అసం పూర్తిగా ఉంది. దీంతో గ్రామాలకు బస్సులు లేక ప్రజ లు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాల్సిన దుస్థితి నె లకొంది. చెన్నూరు-భీమారం ప్రధాన రహదారిలోని జో డు వాగుల వద్ద సైతం అటవీ శాఖ అనుమతి లేదని రహదారి వెడల్పు పనులు నిలిచిపోయాయి. అటవీ శా ఖ అనుమతులు వస్తే రోడ్డు నిర్మాణం వేగిరం కానుం ది. అలాగే పోడు సాగుపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు దౌర్జన్యా లు ఏదో ఒక చోట జరుగుతున్నాయి. దశాబ్దాలుగా సా గు చేసుకుంటున్న రైతులపై అటవీ శాఖ అధికా రులు దాడులు చేస్తున్నారనే చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి ఉంది. దీనిపై మంత్రి దృష్టి పెడితే సమస్య పరిష్కా రం అవుతుంది. ఇంకా పలు చోట్ల రోడ్లు, రహదారుల నిర్మాణాలతో పాటు వాగులపై వంతెనలు చేపట్టాల్సి ఉంది. ఇన్ని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతు న్న చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసు కువెళ్లేందుకు మంత్రిపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:38 PM